
4 కోట్లతో సినిమా తీసి రిలీజ్ ముందు నానా రచ్చ చేసి వచ్చిన అర్జున్ రెడ్డి రిలీజ్ తర్వాత చేసిన హంగామాకు ప్రతి ఒక్కరు సాక్షులే. విజయ్ దేవరకొండ హీరోగా షాలిని పాండే హీరోయిన్ గా సందీప్ డైరక్షన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకుంది. సినిమా చూసి సెలబ్రిటీస్ అంతా షాక్ అయ్యి ట్వీట్ చేసిన సంగతి మర్చిపోలేం. ఇక ఈ సినిమా రీమేక్ ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ముందుగా కోలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ సెట్స్ మీదకు వెళ్లబోతుంది. బాలా డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో చియాన్ విక్రం తనయుడు ధ్రువ్ హీరోగా నటిస్తున్నాడు. అతనికిది తొలి సినిమా అవడం విశేషం. ఇక ఈ సినిమాకు అక్కడ టైటిల్ గా 'వర్మ' అని పెట్టబోతున్నారట. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ టైంలో వర్మ చేసిన హడావిడి తెలిసిందే. ఇక్కడ సినిమాకు వర్మతో ఎటాచ్ మెంట్ ఉంది.. మరి అక్కడ వర్మ అని టైటిల్ పెట్టడంలో అర్ధం ఏంటో తెలియాల్సి ఉంది.