
మంచిగా ఉన్నప్పుడు గుర్తురాని దేవుడు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం గుర్తొస్తాడని అంటారు. ప్రస్తుతం దీపిక పరిస్థితి ఈ కోట్ కు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. అమ్మడు రీసెంట్ గా తిరుమల తిరుమతి వాసుడిని అదేనండి ఏడుకొండవారిని దర్శించుకుంది. తన మొదటి సినిమా దర్శకురాలు ఫరా ఖాన్ కలిసి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంది దీపిక పడుకునే.
అమ్మడు ప్రస్తుతం సంజయ్ లీల భన్సాలి డైరెక్ట్ చేస్తున్న పద్మావతి సినిమాలో నటిస్తుంది. టైటిల్ రోల్ పోశిస్తున్న ఈ సినిమా చుట్టూ వివాదాలు ఏర్పడ్డాయి. ఏకంగా సినిమా విడుదలకు అడ్డుపడుతూ కొందరు కోర్ట్ లో పిటీషన్ వేశారు. అయితే కోర్ట్ కూడా సినిమా యూనిట్ కు కాస్త సపోర్ట్ గా నిలిచిందని తెలుస్తుంది. సజావుగా రిలీజ్ అవ్వాల్సిన సినిమాకు ఇలా షాకులు తగులుతుంటే అమ్మడికి దేవుడు గుర్తొచ్చాడని అంటున్నారు.
తిరుమల వివిఐపి దర్శనంలో తిరుమల వాసుడిని చూసిన దీపికా తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆమెతో ఫరా ఖాన్ కూడా వచ్చి దర్శనం చేసుకున్నారు. డిసెంబర్ 1న రిలీజ్ అవనున్న పద్మావతి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.