
ఓ పక్క పవన్ త్రివిక్రం సినిమా ఏదై ఉంటుందా అనుకుంటూ అభిమానులు మెంటలెక్కేలా ఆలోచిస్తుంటే.. వచ్చిన అన్ని టైటిల్స్ లో ది బెస్ట్ టైటిల్ అభిమానుల ఫీడ్ బ్యాక్ తో ఫైనల్ చేశారు. అజ్ఞాతవాసి అన్నది బయటకు వదిలిందే చిత్రయూనిట్ అని అంటున్నారు. అయితే ఇప్పటికి ఆ సినిమా టైటిల్ మీద సందేహం వీడలేదు. ఇక మరో పక్క సినిమా ఆడియో డేట్ కూడా ఎనౌన్స్ చేశారు.
పవర్ స్టార్ త్రివిక్రం కాంబో అనగానే చంకలు గుద్దేసుకున్న ఫ్యాన్స్ అంతా ఎప్పుడో మొదలైన ఈ సినిమా నుండి కనీసం ఓ ఫస్ట్ లుక్ కూడా రాలేదని అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయంపై త్రివిక్రం ఎందుకు జాప్యం చేస్తున్నాడనేది ఎవరికి అర్ధం కాని టాస్క్. పవన్ సినిమా అంటే క్రేజ్ మాములుగా ఉండదు అలాంటి సినిమా విషయంలో క్లారిటీ లేకపోవడం కాస్త ఇబ్బంది కరమైన విషయమే.
టైటిల్ రాలేదు అయితే ఆడియో రిలీజ్ మాత్రం డిసెంబర్ 14న అని ఫిక్స్ చేశారట. కోలీవుడ్ యువ సంగీత కెరటం అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి సాంగ్ బయటకొచ్చి చూస్తే ఆల్రెడీ వచ్చింది సూపర్ హిట్ అయ్యింది. డైరెక్ట్ గా ఆడియోకే ట్రైలర్ రిలీజ్ చేస్తారని అంటున్నారు. మరి ఇన్నాళ్ల ఎదురుచూపులకు అజ్ఞాతవాసి ఎలా ఉండబోతాడో చూడాలి.