
పవన్ త్రివిక్రమ్.. హ్యాట్రిక్ కాంబినేషన్ అని అభిమానులు సంబర పడుతుంటే సినిమా మొదలు పెట్టి ఇన్నాళ్లవుతున్నా కనీసం టైటిల్ కూడా ఎనౌన్స్ చేయని కన్ ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు పవన్ సినిమా దర్శక నిర్మాతలు. సినిమా టైటిల్ విషయంలోనే క్లారిటీ రాలేదు అన్న గాసిప్పు కొన్నాళ్లు హల్ చల్ చేయగా ఇప్పుడు అసలు సినిమానే కాపీ అంటూ కొత్త మరక అంటేసుకుంది. సెట్స్ మీద ఉన్న సినిమా గురించి ఇలాంటి రూమర్స్ కామనే కాని బలమైన కారణాలతో పవన్ త్రివిక్రం మూవీ పక్కా కాపీ అంటున్నారు.
ఇంతకీ ఇక్కడ విషయం ఏంటంటే అజ్ఞాతవాసి అనే టైటిల్ తో వస్తున్న పవన్ త్రివిక్రం మూవీ సినిమాపై భారీ హైప్ వచ్చింది. అందుకే సినిమా గురించి ఏదో ఒక రూమర్ స్ప్రెడ్ అవుతూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా వెంకటేష్ నటించిన ఒంటరి పోరాటం సినిమా కథకు దగ్గరగా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. కొందరైతే ఆ సినిమా కాపీ కొట్టాల్సిన అవసరం త్రివిక్రం కు ఏముంది అని సర్ధిచెప్పేస్తున్నారు. ఏది ఏమైనా పవన్ త్రివిక్రం మూవీ ఈ కన్ ఫ్యూజన్స్ అన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే సినిమా వచ్చే దాకా ఆగాల్సిందే.