
మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ ఫిదాతో కాని ఆ ఫ్యామిలీ హీరోల రేంజ్ హిట్ కొట్టలేదు. ఎలాంటి అంచనాలు లేని ఫిదా మూవీ వరుణ్ తేజ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాతో మరోసారి తన దర్శకత్వ ప్రతిభ చాటుకున్నాడు శేఖర్ కమ్ముల. భానుమతిగా సాయి పల్లవి చేసిన అల్లరి ఇంకా గుర్తే ఉంది. అయితే ఈ సినిమా సక్సెస్ చూసి ఆడియెన్స్ ఈ సినిమాకు ఎంతగా కనెక్ట్ అయ్యారో కనిపెట్టిన దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాలోని పాత్రని కంటిన్యూ చేస్తూ ఫిదా సీక్వల్ కథ రాసుకున్నాడట.
శేఖర్ కమ్ముల చేసిన ఫిదాకు నిన్ను కోరి డైరక్టర్ సీక్వల్ రాయడం కాస్త కొత్తగా ఉన్నా ఈ సినిమాలోని పాత్రలు ఫిదాలో వరుణ్ తేజ్ పాత్రకు కొనసాగింపుగా ఉంటుందట. ఈమధ్యనే లైన్ చెప్పి వరుణ్ తేజ్ ను ఒప్పించారట. ఫిదా-2 గా ఈ సినిమా వస్తుందని టాక్. ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిచేందుకు సిద్ధమయ్యారట. నానితో నిన్ను కోరి తీసి హిట్ అందుకున్న శివ నిర్వాణ ఫిదా-2 ప్రాజెక్ట్ ఎలా తీస్తాడో చూడాలి.