
స్వామిరారా, దోచెయ్, కేశవ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకున్న సుధీర్ వర్మ ప్రస్తుతం శర్వానంద్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ రెండు పాత్రల్లో నటించనున్నాడట. అది కూడా ఒకటి యంగ్ ఏజ్ రోల్ అయితే మరోటి మిడిల్ ఏజ్ రోల్ లో కనిపిస్తాడట. ఇక ఇందులో హీరోయిన్స్ ఎవరిని పెట్టాలా అన్నదే పెద్ద చిక్కొచ్చి పడ్డది.
యంగ్ ఏజ్ రోల్ కు కుర్ర హీరోయిన్ ఎవరైనా ఓకే కాని, మిడిల్ ఏజ్ రోల్ కు జోడి అంటే సీనియర్ భామలు కావాలి.. ప్రస్తుతం ఉన్న వారిలో కాజల్ మంచి ఫాంలో ఉంది కాబట్టి ఆమెను ఒప్పించారట. మొదట శర్వా సినిమా కాదన్నా తర్వాత ఓకే అనేసింది అమ్మడు. ఈ సినిమాకు కాజల్ 2 కోట్ల దాకా డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. ఇక ఇదే కాకుండా తేజ డైరక్షన్ లో వెంకటేష్ హీరోగా చేస్తున్న సినిమాకు కాజల్ ను సెలెక్ట్ చేశారని టాక్.