
ఎన్నాళ్లకెన్నాళ్లకో అన్నట్టుగా యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ నటించిన గరుడవేగ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా కలక్షన్స్ ఎలా ఉన్నా ఈ సినిమా మౌత్ టాక్ చాలా వరకు హెల్ప్ చేసింది. దర్శకుడి ప్రవీణ్ సత్తారు గురించి చాలా గొప్పగా మాట్లాడుకున్నారు. ఇక రాజశేఖర్ కం బ్యాక్ సినిమా ఇదంటూ హడావిడి చేశారు. సినిమాకు వచ్చిన పాజిటివ్ బజ్ చూసి దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ సినిమా చూస్తున్నా అంటూ ట్వీట్ చేశాడు.
ఆదివారానికే టికెట్ బుక్ చేసుకున్నా అంటూ పెట్టిన జక్కన్న సినిమా చూశాక ఎందుకు మాట్లాడలేదు. సినిమాపై తన స్పందన తెలియచేయడంలో రాజమౌళి ఎందుకు వెనుకాడాడు అన్నది ఇప్పుడు మరో న్యూస్ అయ్యింది. ఒకవేళ రాజమౌళికి గరుడవేగ నచ్చలేదా.. నచ్చినా నచ్చకున్నా సినిమా ఎలాగు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఓ మాట అనేస్తే పోలా అంటూ కామెంట్లు విసురుతున్నారు. బాగాలేని సినిమాలకు ప్రమోట్ చేసి మాటలు పడ్డ రాజమౌళి కాస్త కూస్తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా గురించి నోరు విప్పక పోవడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది.