
గురు తర్వాత సరైన కథల కోసం ఎదురుచూస్తున్న విక్టరీ వెంకటేష్ కిశోర్ తిరుమలతో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా ఎనౌన్స్ చేసి మళ్లీ ఎందుకో వెనక్కి తగ్గాడు. ఫైనల్ గా తేజతో సినిమా ఫిక్స్ అయిన వెంకటేష్ త్వరలో ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ అందుకున్న తేజ వెంకటేష్ తో సినిమా టైటిల్ గా ఆటా నాదే.. వేటా నాదే అని నిర్ణయించారట.
టైటిల్ కాస్త కొత్తగా ఉందని తెలుస్తుంది. ఇందులో వెంకటేష్ మరోసారి తన ఉగ్రరూపాన్ని చూపిస్తారని అంటున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో ఈ సినిమా వస్తుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి వెంకటేష్ తో తేజా తీస్తున్న ఈ ఆటా నాదే... వేటా నాదే ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.