లీడర్ కాంబో సెట్ అయ్యిందా..!

దగ్గుబాటి వారసుడు రానా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన లీడర్ సినిమాతోనే తెరంగేట్రం చేశాడని తెలిసిందే. శేఖర్ కమ్ముల మార్క్ సినిమాగా వచ్చిన లీడర్ రానా సత్తా ఎంటో చూపించింది. ఇక ఆ తర్వాత రానా ఎంచుకున్న సినిమాలు వాటి ఫలితాల గురించి అందరికి తెలిసిందే. బాహుబలి భళ్ళాలదేవగా రానా చూపించిన అభినయం అంతా ఇంతా కాదు. ఇక ఓ పక్క హీరోగా చేస్తూ విలన్ గా అంత పెద్ద సినిమాలో నటించడం మామూలు విషయం కాదు. 

మరోసారి శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో రానా సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. లీడర్ కాంబో త్వరలోనే సెట్ కాబోతుందట. ఈమధ్యనే ఫిదా హిట్ తో తన సత్తా ఏంటో చూపించిన శేఖర్ కమ్ముల రానాకు సరిపోయే కథ రాసుకున్నాడట. ముందు విజయ్ దేవరకొండ లాంటి హీరోతో చేద్దామనుకున్న శేఖర్ కమ్ముల ఫైనల్ గా రానాకే ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది. మరి క్రేజీ కాంబినేషన్ గా రాబోతున్న ఈ సినిమా మళ్ళీ ఎలాంటి సంచలనాలు సృస్తిస్తుందో చూడాలి.