భాగమతి లుక్.. మరో అరుంధతి పక్కా..!

ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాణం పోసిన స్వీటీ అనుష్క ప్రస్తుతం అశోక్ డైరక్షన్ లో నటిస్తున్న సినిమా భాగమతి. ఈ సినిమా ఫస్ట్ లుక్ రేపు నవంబర్ 7 అనుష్క పుట్టినరోజు కానుకగా కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ చేశారు. సినిమా ఫస్ట్ లుక్ అంచనాలకు మించి ఉందని చెప్పాలి. యువి క్రియేషన్స్ బ్యానర్లో సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందే చెప్పేలా సినిమా ఫస్ట్ లుక్ ఉంది.  


సినిమాలో అనుష్క డ్యుయల్ రోల్ చేసిందని తెలుస్తుంది. అరుంధతి తర్వాత అనుష్క చేస్తున్న ఈ భాగమతి సినిమా ఫస్ట్ లుక్ తో సర్ ప్రైజ్ ఇచ్చింది. సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉన్న దర్శక నిర్మాతలు డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారట. మరి ఈ సినిమా అరుంధతి రేంజ్ లో ఉంటుందా లేదా అన్నది చూస్తేనే కాని చెప్పలేం.