గరుడవేగ సీక్వల్ కూడానా..?

యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో వచ్చిన సినిమా గరుడవేగ. టీజర్, ట్రైలర్ తో అంచనాలను ఏర్పరచిన ఈ సినిమా సినిమా కూడా వాటిని మించిన రేంజ్ లో ఉండటంతో సినిమాను హిట్ చేశారు ప్రేక్షకులు. అసలు సిసలైన స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా పెట్టిన ప్రతి పైసా సినిమాలో కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ చూసి గరుడవేగ సీక్వల్ కు సిద్ధమవుతున్నారట దర్శక నిర్మాతలు.

రాజశేఖర్ కు ఇప్పటికే ప్రవీణ్ సత్తారు ఈ సినిమా సీక్వల్ లైన్ చెప్పారట. గరుడవేగ-2 కచ్చితంగా ఇది కూడా భారీ అంచనాలు ఏర్పరచుకుంటుంది. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ రాక వెనుపడ్డ రాజశేఖర్ ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కేశాడు. యూఎస్ లో కూడా ఈ సినిమా కలక్షన్స్ బాగున్నాయని తెలుస్తుంది. మరి అన్ని కుదిరి గరుడవేగ-2 కూడా వస్తే ఇక ఆ లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.