
కింగ్ నాగార్జున నిర్మాణంలో తనయుడు అఖిల్ హీరోగా సెకండ్ ప్రయత్నంగా చేస్తున్న సినిమా హలో. మనంతో అక్కినేని ఫ్యామిలీకి చాలా దగ్గరైన దర్శకుడు విక్రం కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా 40 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా రిలీజ్ ను డిసెంబర్ 22న ఫిక్స్ చేశాడు నాగార్జున. అనుకున్న డేట్ కల్లా ఎలాగైనా సినిమాను పూర్తి చేయాలని విక్రం కు చెప్పాడట.
సినిమా ఇప్పటిదాకా మంచి క్వాలిటీతో వచ్చిందని రిలీజ్ కోసం సినిమాను చుట్టేయడం మంచిది కాదని వారిస్తున్నాడట విక్రం. నాగ్ మాత్రం సినిమా అనుకున్న డేట్ కల్లా పూర్తి చేయాలని వార్నింగ్ ఇచ్చాడట. కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అఖిల్ కెరియర్ కు చాలా ఇంపార్టెంట్ మరి అలాంటిది నాగార్జున ఎందుకు ఇంత తొందరపడుతున్నాడో తెలియట్లేదు. డిసెంబర్ మిస్ అయితే సినిమా మరో రెండు నెలలు పోస్ట్ పోన్ అవుతుంది. అందుకే నాగార్జున పట్టుపడుతున్నాడని అంటున్నారు.