
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో కొంత మంది అదృష్టం కలిసి వచ్చి హీరోలుగా నటించారు. అయితే హీరోలుగా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో మళ్లీ కమెడియన్లుగానే సెటిల్ అయ్యారు. తాగా వీరిజాబితాలోకి చేరిపోయాడు కమెడియన్ సప్తగిరి. ఇప్పటి వరకు ఎన్నో కామెడీ పాత్రలతో కనువిందు చేసిన సప్తగిరి ఆ మద్య సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరోగా అలరించాడు.
మొదటి సినిమాతో మంచి విజయం సాధించిన సప్తగిరి ఇప్పుడు సప్తగిరి ఎల్.ఎల్.బి తో మరోసారి కనువిందు చేయడానికి వస్తున్నాడు. ఈ సినిమాసంబంధించి ఓ టీజర్ నిన్న రిలీజ్ అయ్యింది. అయితే సప్తగిరి టైటిల్ మనోడికి బాగానే కలిసి వచ్చిందని దీంతో తాను త్వరలో తీయబోయే సినిమాకు సప్తగిరి వెడ్స్ సన్నీ లియోన్ టైటిల్ పెడుతున్నట్టు తెలుస్తుంది. దాదాపు ఇదే టైటిల్ ని యూనిట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుండగా, కేవలం టైటిల్ తోనే సినిమాకి మంచి పబ్లిసిటీ లభించడం ఖాయం అంటున్నారు. మరి ఇందులో సన్నీ లియోన్ నటిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.