ఈసారి టైటిల్ మిస్సేనా..!

పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న మూవీ టైటిల్ పై సస్పెన్స్ ఇంకా వీడలేదు. టైటిల్ దాదాపు అజ్ఞాతవాసి అని అంటున్నా సినిమా టైటిల్ అదే అంటూ అఫిషియల్ స్టేట్మెంట్ ఏది రాలేదు. దసరా, దీపావళి పండుగలను వదిలి పెట్టి త్రివిక్రం పుట్టినరోజు నాడు ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తారని అన్నారు. నవంబర్ 7న త్రివిక్రం బర్త్ డే అయితే ఆరోజు కూడా టైటిల్ రివీల్ చేయరట.

కేవలం ఆ సినిమాలోని ఓ సాంగ్ 'బయటకొచ్చి చూస్తే' రిలీజ్ చేస్తారట. ఆల్రెడీ ఈ సాంగ్ ను పవర్ స్టార్ బర్త్ డే నాడు బిట్ సాంగ్ గా వదిలారు. ఇప్పుడు త్రివిక్రం బర్త్ డే నాడు మొత్తం సాంగ్ రిలీజ్ చేస్తారట. మొత్తానికి టైటిల్ కన్ ఫ్యూజన్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.. టైటిల్ పై ఈ సాగదీత ఎందుకో వారికే తెలియాలి. ఇక రాబోతున్న సాంగ్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.