
ముందు దర్శకుడిగా ఆ తర్వాత హీరోగా ప్రయత్నం చేసి పర్వాలేదు అనిపించుకున్న అడివి శెష్ క్షణం సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బాహుబలిలో భద్ర పాత్ర వేసినా అంత లాభం చేకూరలేదు. అమీ తుమీతో మళ్లీ సోసోగానే అలరించిన అడివి శేష్ ప్రస్తుతం గూఢచారి సినిమా చేస్తున్నాడు. శషికిరణ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్, విస్టా డ్రీం మర్చంట్స్ కలిసి నిర్మిస్తున్నారు.
మిస్ ఇండియా శోభిత ధూళిపాల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అడివి శేష్ కథ అందించడం విశేషం. ఇక ఈ సినిమా టైటిల్ లోగో ఈరోజు రిలీజ్ చేశారు. టైటిల్ కు తగ్గట్టుగానే ప్రీ లుక్ ఉంది. ఇక అసలు ఫస్ట్ లుక్ డిసెంబర్ 17న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. సినిమా కూడా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తెస్తారట. మరి అడివి శేష్ ను నిలబెట్టే సినిమాగా గూఢచారి ఉంటుందా లేదా అన్నది చూడాలి.