డౌటే లేదు ఎన్టీఆర్ నెక్ష్ట్ అతనితోనే..!

జై లవ కుశ సక్సెస్ తో మంచి జోష్ మీదున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొద్దిపాటి గ్యాప్ తో త్రివిక్రం తో సినిమా మొదలు పెట్టనున్నాడు. ఆల్రెడీ ఆ సినిమా ముహుర్తం కూడా పెట్టేశారు. స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చి ఆ సినిమాకు మొదటి క్లాప్ కొట్టారు. ప్రస్తుతం జాలీ ట్రిప్ లో ఉన్న ఎన్.టి.ఆర్ అది పూర్తి చేసుకుని వచ్చాక త్రివిక్రం సినిమా రెగ్యులర్ షూట్ లో జాయిన్ కానున్నాడట. ఇక ఇదే కాకుండా తన తర్వాత సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు ఎన్.టి.ఆర్.

ఒక సినిమా తీశాక మరో సినిమా అంటూ కూర్చుంటే కేవలం సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే వస్తుంది. అందుకే ఒక సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే తర్వాత సినిమా కన్ఫాం చేసుకోవాలని చూస్తున్నాడు ఎన్.టి.ఆర్. ఈ క్రమంలో తన తర్వాత సినిమా శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగేశ్నకు ఓకే చెప్పినట్టు టాక్. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలకు కాలం చెల్లింది అనుకుంటున్న ఈరోజుల్లో శతమానం భవతి సినిమాతో నేషనల్ అవార్డును సైతం సాధించిన సతీష్ వేగేశ్న శ్రీనివాస కళ్యాణం కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమా ఎన్.టి.ఆర్ కు వినిపించగా ఓకే అన్నాడట. దిల్ రాజు నిర్మాత కాబట్టి ఇక ఆలోచించాల్సిన పనిలేదని అనుకుంటున్నాడట జూనియర్. మరి ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.