
నారా రోహిత్, శ్రీవిష్ణు ఇద్దరు మంచి స్నేహితులు. శ్రీవిష్ణుకి లైఫ్ ఇచ్చిన రోహిత్ ఇప్పుడు అతని నుండే గట్టి పోటీ ఎదుర్కుంటున్నాడు. నారా రోహిత్ హీరోగా వస్తున్న సినిమా బాలకృష్ణుడు ఈ నెల 24న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ టైంలోనే శ్రీవిష్ణు నటించిన మెంటల్ మదిలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇద్దరు మంచి స్నేహితులు కాని వారి సినిమాలు మాత్రం ఎవరికి వారు తగ్గకుండా రిలీజ్ చేస్తున్నారు.
ఈ రెండు సినిమాల్లో శ్రీవిష్ణు మెంటల్ మదిలో సినిమాకు కాస్త కూస్తో పాజిటివ్ బజ్ ఉంది. అంతేకాకుండా సినిమాను సురేష్ బాబు రిలీజ్ చేస్తున్నాడు. అందుకే ఈ రిలీజ్ క్లాష్ అయ్యిందని తెలుస్తుంది. మొత్తానికి అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో హిట్ అందుకున్న ఈ ఇద్దరు ఒకేసారి బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమయ్యారు. మరి వీరిలో విజయం ఎవరిని వరిస్తుంది అన్నది చూడాలంటే సినిమాలు వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.