సాహో టీం వాటిని బ్యాన్ చేసింది..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత సుజిత్ డైరక్షన్ లో చేస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా 150 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ అంతా గోప్యంగా ఉండేలా షూటింగ్ లొకేషన్ లో మొబైల్స్ బ్యాన్ చేశారని తెలుస్తుంది. సినిమాకు సంబందించిన ఎలాంటి విషయం బయటకు రానివ్వకూడదని చిత్రయూనిట్ ఇలా ప్లాన్ చేసింది.

బాహుబలి సినిమాకు కూడా రాజమౌళి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. సాహోకి అదే ఫాలో అవుతున్నారు. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. 2018 సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేసుకున్న ఈ సాహో సిని ప్రేక్షకులకు అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ అందించేలా తెరకెక్కుతుంది. మరి బాహుబలితో నేషనల్ వైడ్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ప్రభాస్ సాహోతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.