
మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మాతల హీరోగా మారుతున్నాడని తెలుస్తుంది. కష్టాల్లో ఉన్న నిర్మాతకు తాను అండగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఈమధ్యనే స్పైడర్ గా డిజాస్టర్ మూవీతో డిప్రెషన్ లోకి వెళ్లిన నిర్మాత ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లకు చరణ్ సపోర్ట్ అందిస్తున్నాడట. మంచి కాంబినేషన్ తెస్తే తాను సినిమా చేసేందుకు సిద్ధమే అంటూ అవకాశం ఇస్తున్నాడట.
చరణ్ తో సినిమా అంటే నిర్మాత మాత్రం కాదంటాడు చెప్పండి. తనకు ధ్రువ లాంటి హిట్ కం మేకోవర్ ఇచ్చిన నిర్మాతలు ఇలా ఢీలా పడటం జీర్ణించుకోలేని చరణ్ తన ఆఫర్ తో వారిని సర్ ప్రైజ్ చేశాడు. బోయపాటి శ్రీనుతో చరణ్ చేయబోయే సినిమాకు ఈ నిర్మాతలే ప్రొడ్యూస్ చేస్తారని తెలుస్తుంది. అయితే మహేష్ కూడా ఈ నిర్మాతలకు మరో సినిమా ఇవ్వాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.