విజయ్ అక్కడ కూడా అదరగొట్టాడు..!

తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ మాస్ హీరో విజయ్ అని చెప్పొచ్చు. గత కొంత కాలంగా విజయ్ నటించిన సినిమాలు వరుస విజయాలు సాధిస్తున్నాయి. తాజాగా విజయ్ నటించిన మెర్సల్ భారత దేశంలో ఎన్నో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్నో వివాదలతో పాటు వసూళ్లు కూడా రాబట్టింది. అయితే ఒక్క తమిళనాడులోనే కాకుండా ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దుమ్మురేపేస్తోంది. 12 రోజుల్లో ఓవర్సీస్ లో ఈ సినిమా 72 కోట్లు వసూలు చేయడం విశేషం. ఫ్రాన్స్, మలేసియాల్లోను ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది.  

ఇక ఫ్రాన్స్ లో ఎక్కువ వసూళ్లు చేసిన ఇండియన్ మూవీస్ ఏవంటే.. మొదటి ప్లేస్ లో కబాలి .. రెండవ స్థానంలో బాహుబలి ఉండగా, మూడవస్థానంలో మెర్సల్ నిలిచింది. అక్కడ అత్యధిక వసూళ్లను సాధించిన మొదటి తమిళ సినిమాగా కబాలి ఉండగా.. రెండవ తమిళ సినిమాగా మెర్సల్ నిలిచింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా 139.52 కోట్ల గ్రాస్ ను వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా 211.44 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.