
కుమారి 21ఎఫ్ తో కుర్రాళ్ల మనసులను దోచేసిన హెబ్భా పటేల్ ఆ సినిమాతో ఒక్కసారిగా సూపర్ క్రేజ్ దక్కించుకుంది. మొదటి సినిమా అలా ఎలా ఆడకపోయినా కుమారితో హిట్ అందుకుంది అమ్మడు. ఇక ఆ తర్వాత అమ్మడు అదే హాట్ ఇమేజ్ క్యారీ చేస్తూ సినిమాలు చేసింది. ఈ ఇయర్ మెగా హీరో వరుణ్ తేజ్ తో మిస్టర్ లో నటించిన హెబ్భా పటేల్ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఢీలా పడింది.
ప్రస్తుతం ఈ శుక్రవారం ఏంజెల్ సినిమాతో రాబోతున్న హెబ్భా చేతిలో సినిమాలేవి లేవని అంటుంది. కుమారి పిల్ల ఇంత త్వరగా ఖాళీ అవడం ఏంటని చర్చలు మొదలయ్యాయి. రాజ్ తరుణ్ తో నటించిన మూడు సినిమాలు హిట్ అయ్యాయి కుర్రోడేమో యమ స్పీడ్ మీద సినిమాలు చేస్తున్నాడు. మరి ఈ ఇద్దరితో మళ్లీ హిట్ వస్తే కాని హెబ్భా కెరియర్ లో జోష్ వచ్చేలా లేదు. తెలుగులో అవకాశాలు రావట్లేదని తమిళంలో ప్రయత్నాలు మొదలు పెట్టింది హెబ్భా పటేల్. మరి అక్కడ కుమారి లక్ ఎలా ఉందో చూడాలి.