ఆ ఇద్దరితో శర్వా రొమాన్స్..!

యువ హీరోల్లో మంచి జోరు కొనసాగిస్తున్న శర్వానంద్ ఈ ఇయర్ రిలీజ్ చేసిన మూడు సినిమాల్లో రెండిటితో సూపర్ హిట్ అందుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన మహానుభావుడు హిట్ తో మరోసారి తన సత్తా చాటిన శర్వానంద్ సుధీర్ వర్మ డైరక్షన్ లో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారని తెలుస్తుంది. ఇద్దరు భామలతో శర్వా రొమాన్స్ చేయబోతున్నాడట.

ఇక హీరోయిన్స్ గా అర్జున్ రెడ్డి ఫేం షాలిని పాండే ఒకరు కాగా సెకండ్ హీరోయిన్ గా నివేదా థామస్ ను ఫైనల్ చేశారట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత శర్వానంద్ అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగతో కూడా సినిమా చేస్తాడని అంటున్నారు. అంతేకాదు హను రాఘవపుడితో శర్వా సినిమా కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయట.