రిసెప్షన్ డేట్ అదేనా..!

ప్రేమజంట చైతు సమంతలు కొద్ది మంది సెలబ్రిటీస్ సమక్షంలోనే పెళ్లి తంతు కానిచ్చేశారు. పెళ్లైన వెంటనే హైదరాబాద్ లో రిసెప్షన్ అన్నారు కాని అది ఎందుకో కుదరలేదు. అయితే పెళ్లి అయ్యిందో లేదో ఎంచక్కా హనీమూన్ కు యూరప్ వెళ్లారు చైతు సమంతలు. నాగార్జున మాత్రం హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తున్నారట. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ నెల 12న ఎన్ కన్వెన్షన్ లో చైతు సమంతల రిసెప్షన్ ఉంటుందట.

సిని, రాజకీయ, బిజెనెస్ రంగాలకు సంబందించిన అందరికి ఈ రిసెప్షన్ ఇన్విటేషన్ పంపిస్తున్నారట నాగార్జున. గోవాలో పెళ్లి కానిచ్చినా అసలు హైదరాబాద్ లో హంగామా ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతం సినిమాలకు చిన్నపాటి గ్యాప్ ఇచ్చిన చైతు సమంత హనీమూన్ ముగించుకుని వచ్చాక కాని తమ తదుపరి సినిమా షూటింగ్స్ లో పాల్గొననున్నారు.