
రవిరాజా పినిశెట్టి ఎంత పెద్ద దర్శకుడో తెలిసిందే.. తెలుగు తమిళ భాషల్లో స్టార్స్ తో సినిమాలు తీసిన ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక ఆయన తనయుడు ఆది పినిశెట్టి హీరోగా ఇంట్రడ్యూస్ అయినా ఎలాంటి పాత్రలనైనా చేసేందుకు సిద్ధమయ్యాడు. సరైనోడుతో విలన్ గా మారిన ఆది ప్రస్తుతం పవన్ త్రివిక్రం సినిమాలో కూడా విలన్ గా నటిస్తున్నాడట.
ఈ సినిమా షూటింగ్ టైంలో పవర్ స్టార్ తో పనిచేసిన అనుభూతులు గురించి పంచుకున్నాడు ఆది. పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద స్టార్ అయినా ఆ హోదా ఏది ఇతరుల దగ్గర చూపించరని అన్నాడు. పవర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. త్రివిక్రం సినిమా ఫోన్ రాగానే వెంటనే ఆనంద పడ్డానని సినిమా తప్పకుండా తనకి మంచి పేరు తెచ్చి పెడుతుందని అంటున్నాడు ఆది. ఓ పక్క విలన్ గా చేస్తూనే సోలో హీరోగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు ఆది.