2.0 ఎఫెక్ట్ కాలా కూడా వాయిదానే..!

ప్రస్తుతం తమిళనాట రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమైన రజినికాంత్ త్వరలోనే సొంత పార్టీని ఎనౌన్స్ చేస్తాడని తెలుస్తుంది. ఇక మరో పక్క రజిని నటించిన 2.0 వాయిదా పడగా దానితో పాటుగా చేస్తున్న పా.రంజిత్ కాలా సినిమా కూడా పోస్ట్ పోన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాలా సినిమా రజిని రాజకీయ రంగానికి ఉపయోగపడే సినిమాగా తెరకెక్కిస్తున్నారట.

డాన్ గా కనిపిస్తూనే తమిళ ప్రజలను కాపాడే పాత్రలో కాలాలో కనిపిస్తాడట రజినికాంత్. అందుకే 2.0 వాయిదా పడినా ముందు కాలా మాత్రం రిలీజ్ చేసే ప్రసక్తే లేదని బల్లగుద్ది మరి చెబుతున్నాడు కాలా నిర్మాత రజిని అల్లుడు ధనుష్. 2.0 వాయిదా దాదాపు కన్ఫాం అయినట్టే. కాబట్టి కాలా కూడా దాని తర్వాత టైం చూసి రిలీజ్ చేస్తామని అన్నాడు ధనుష్. కోలీవుడ్ మీడియా మాత్రం కాలా జూన్ జూలైలో వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.