శర్వానంద్ కు షాక్ ఇచ్చిన కాజల్..!

స్టార్స్ తో నటించిన తారామణులకు కుర్ర హీరోలంటే ఎక్కడో ఓ చిన్న చూపని అంటారు అది మరోసారి ప్రూవ్ అయ్యింది. తెలుగులో వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న శర్వానంద్ మహానుభావుడు లాంటి సక్సెస్ తర్వాత సుధీర్ వర్మతో సినిమా షురూ చేస్తున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ డ్యుయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో ఒకటి యూత్ ఫుల్ పాత్ర కాగా మరోటి మిడిల్ ఏజ్ రోల్ అని తెలుస్తుంది.

ఇక ఇద్దరికి ఇద్దరు హీరోయిన్స్ కావాలి కాబట్టి కుర్ర పాత్రకు ఓ యువ కథానాయికను అనుకోగా మిడిల్ ఏజ్ రోల్ చేసే పాత్రకి కాజల్ ను తీసుకుందామని అనుకున్నారట. ఈ క్రమంలో సుధీర్ వర్మ కాజల్ తో చర్చలు జరుపగా ఆమె శర్వాతో నటించేందుకు నో చెప్పిందని టాక్. కాజల్ నో చెప్పినందుకు కారణాలైతే తెలియలేదు. మరి స్టార్స్ తో మాత్రామే నటిస్తేనే స్టార్ అవుతారు అనుకుంటే ప్రస్తుతం రకుల్ అటు స్టార్స్ తో చేస్తూనే మరో పక్క యువ హీరోలందరితోనూ జోడి కడుతుంది. కాజల్ కాదన్న ఈ సినిమా తమన్నా చెంత చేరిందని టాక్.