
రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో సినిమా గురించి ఎదురుచూడని సిని ప్రేమికుడు ఉండడని చెప్పొచ్చు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్టామినా తెలియచేసేలా ప్రతిభ చాటిన రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో సినిమా అంటే ఆ అంచనాలు వేరేలా ఉంటాయి. అయితే ఈ కాంబినేషన్ కు అడ్వాన్సులు కూడా అందాయని తెలిసిందే. కె.ఎల్.నారాయణ ఈ ఇద్దరికి అడ్వాన్స్ రూపంలో కొంత ఎమౌంట్ కూడా ఇచ్చాడట.
అయితే రాజమౌళితో మహేష్ సినిమా 2020లోనే అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు. ప్రస్తుతం కొరటాల శివ సినిమా చేస్తున్న మహేష్ 2018 మొదట్లో వంశీ పైడిపల్లి సినిమా మొదలు పెడతాడు. ఆ తర్వాత త్రివిక్రం తో సినిమా మొదలవుతుందని తెలుస్తుంది. ఆ సినిమా పూర్తయ్యాక బోయపాటి శ్రీను లైన్ లోనే ఉన్నాడు. ఈ కమిట్మెంట్లు అన్ని పూర్తయ్యాకే మహేష్ రాజమౌళి సినిమా ఉంటుందట. ఎలా లేదన్నా 2019 చివర్లో లేదా 2020లోనే రాజమౌళి మహేష్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ గ్యాప్ లో ఒకటి రెండు సినిమాలు చేయాలని చూస్తున్నాడు రాజమౌళి.