హ్యాట్రిక్ డైరక్టర్ మెగా మల్టీస్టారర్..!

పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న అనీల్ రావిపుడి హిట్ కొట్టాడో లేదో రిలాక్స్ అవ్వకుండా తన తర్వాత సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. చేయబోయే సినిమా కూడా దిల్ రాజు బ్యానర్లోనే ఉంటుందని తెలుస్తుంది. అనీల్ ఈసారి ఓ మల్టీస్టారర్ మూవీ చేయాలని చూస్తున్నాడట. ఇందులో హీరోగా మెగా హీరోలని తీసుకునే ఆలోచనలో ఉన్నారట.

దిల్ రాజు సినిమా అంటే సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్ లు వెనుకాడే ప్రసక్తే లేదు. అదిగాక ఫాంలో ఉన్న దర్శకుడు, ఆడియెన్స్ నాడి పట్టేసిన కుర్రాడు కాబట్టి అనీల్ తో సినిమా అంటే కచ్చితంగా ఓకే అని చెబుతారు. మెగా మల్టీస్టారర్ గా రాబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని డీటేల్స్ త్వరలో తెలుస్తాయి. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్లో నాని హీరోగా ఎం.సి.ఏ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కానుంది.