వరుణ్ తొలిప్రేమ రిలీజ్ ఫిక్స్..!

ఫిదా సక్సెస్ తో జోరు పెంచిన మెగా హీరో వరుణ్ తేజ్ వెంకీ అట్లూరి డైరక్షన్ లో చేస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమాకు టైటిల్ గా తొలిప్రేమ అని పరిశీలణలో ఉంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే. ఇక ఈ సినిమా రిలీజ్ ఫిబ్రవరి 9 అని చిత్రయూనిట్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేసింది. 

ఈ సినిమా కూడా సగానికి పైగా యూఎస్ లో షూట్ చేశారని తెలుస్తుంది. ఫిదాలో ఎన్నారైగా నటించిన వరుణ్ ఆ సెంటిమెంట్ తో ఈ సినిమా కూడా అక్కడే ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఇక పవర్ స్టార్ క్రేజీ మూవీ తొలిప్రేమ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా నిజంగానే ఆ సినిమా అంత హిట్ అవుతుందో లేదో చూడాలి. ఫిదా హిట్ తో తన సత్తా చాటిన వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.