
ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఈమధ్యనే ఉన్నది ఒకటే జిందగి సినిమాతో వచ్చి సక్సెస్ అందుకున్నాడు. కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో రామ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సినిమా హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత రామ్ దిల్ రాజు బ్యానర్లో నక్కిన త్రినాధ రావు డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడట. అసలైతే దిల్ రాజు బ్యానర్లో రవితేజ హీరోగా వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా రామ్ చేయాల్సింది.
రామ్ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడం కుదరక ఆ సినిమా నుండి రామ్ తప్పించేశారట. ఇక ఇప్పుడు త్రినాధరావుతో మాత్రం రామ్ దిల్ రాజు కమిట్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి రెమ్యునరేషన్ రామ్ తగ్గించాడో లేక అతని ఎనర్జికి అతను అడిగింది కరెక్ట్ అనుకున్నాడో కాని రాజు తో రామ్ క్రేజీ కాంబినేషన్ సినిమా సెట్ అయ్యింది. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుందట. నానికి నేను లోకల్ అంటూ హిట్ ఇచ్చిన నక్కిన త్రినాధ రావు రామ్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.