గ్లామర్ డోస్ పెంచిన రష్మీ

ఇటీవలే గుంటూరు టాకీస్ సినిమాలో తన లేత అందాలను ప్రదర్శించి, కుర్రకారుకు మత్తెక్కించిన రష్మీ, ఈసారి తన అందాల ఆరబోత మరింత పెంచడానికి  సిద్ధమయ్యింది. ప్రస్తుతం రష్మీ నటిస్తున్న తాజా చిత్రం అంతం. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఫోటోలు విడుదలైనప్పటి నుంచి రష్మీ హాట్ టాపిక్ గా మారిపోయింది.

తాజాగా విడుదలైన థియేటర్ ట్రైలర్ చూస్తే, సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా వుండబోతుందని అర్థమవుతోంది. అయితే సినిమాలో దాదాపు 20 నిమిషాలు రష్మీ అందాల ప్రదర్శన వుండబోతుందని సమాచారం. పైగా ఈ ట్రైలర్లో రష్మీ చెప్పిన ‘ఇంటికి రా.. స్వర్గం చూపిస్తా’ అనే డైలాగ్ ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. 

రష్మీకి జోడిగా చరణ్ దీప్ నటిస్తున్న ఈ సినిమా, చరణ్ క్రియేషన్స్ బ్యానర్ పై దర్శక నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ తెరకెక్కించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని ఎ సర్టిఫికెట్ పొందిన అంతం, జూన్ చివ‌రి వారంలో విడుద‌ల కానుంది.