
అనేక వందల సూపర్ హిట్ సినిమాలు అందించిన దర్శకుడు రాఘవేంద్రరావు మరోసారి వార్తలకెక్కారు. ఈసారి కూడా సినిమా ఫంక్షన్‌లో అవసరం లేకపోయినా హీరోయిన్లను తాకినందుకే విమర్శల పాలయ్యారు. అనిల్ రావిపూడి, వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో తీయబోతున్న సినిమాకు గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం జరిగింది.
దీనిలో పాల్గొన్న రాఘవేంద్రరావు హీరోయిన్లుగా నటిస్తున్న కీర్తి సురేష్, కృతి శెట్టి చేతులు పట్టుకున్నారు. తర్వాత ఇద్దరినీ పక్కపక్కన నిలబెట్టి క్రుతిశెట్టి భుజంపై చెయ్యేసి ఫోటోలకు ఫోజులిచ్చారు.
అయన సీనియర్ దర్శకుడు కనుక ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మర్యాదలు చేశారు. కానీ అయన తన మనుమరాళ్ళ వయసున్న హీరోయిన్లని అవసరం లేకపోయినా తాకడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
ఇదివరకు మరో సినిమా ఫంక్షన్‌లో కూడా ఆయన నిహారికా కొణిదెల నడుం మీద చెయ్యేసి గట్టిగా పట్టుకున్నారు. అప్పుడు నిహారిక ఆయన చేతిని విడిపించుకోవలసి వచ్చింది. ఈ వయసులో రాఘవేంద్రరావుకి ఇవేమీ పాడు బుద్దులు?అని నెటిజన్స్ విమర్శిస్తున్నా ఆయన తీరు మారకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
Who is this old idiot ?
— Prashanth Rangaswamy (@itisprashanth) June 18, 2026
Who gave him the right to touch women without their consent ? pic.twitter.com/e0CSI1SguT