ఛలో ప్రీ లుక్ వచ్చింది..!

యువ హీరో నాగ శౌర్య హీరోగా వెంకీ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఛలో. కొద్దిరోజులుగా క్రేజీగా మారిన ఈ సినిమా ప్రీ లుక్ ఈరోజు రిలీజ్ చేశారు. ప్రీ లుక్ లో నాగ శౌర్య తిరుప్పురం అనే ఆర్చ్ ఉన్న ఊరిలో అడుగుపెట్టబోతుంటాడు. ఆ రోడ్డు కంచెతో రెండు రోడ్లుగా చీలి ఉంటుంది. మనోడు ఎటు వెళ్తాడు అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ రేపు రిలీజ్ చేస్తారట.

సినిమా స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా హీరోగానే కాదు నిర్మాణంలో కూడా నాగ శౌర్య భాగం పంచుకున్నాడని తెలుస్తుంది. కెరియర్ లో హిట్లు వస్తున్నా సరైనా ప్లానింగ్ లేకుండా నాగ శౌర్య కాస్త ఇబ్బంది పడుతున్నాడని తెలిస్తుంది. మరి ఈ ఛలోతో కుర్రాడు చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందేమో చూడాలి.