
ఖైది నెంబర్ 150తో మెగాస్టార్ పదేళ్ల తర్వాత కూడా తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశారు. ఇక ఆ సినిమా సక్సెస్ జోష్ లోనే తన తర్వాత సినిమాకు ఓ ప్రయోగాత్మక సినిమా ఒప్పుకున్నారు. అదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర. సైరా నరసింహారెడ్డి అంటూ టైటిల్ పోస్టర్ తోనే హడావిడి చేసిన ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే టైం మాత్రం దగ్గరపడట్లేదు.
అసలైతే అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లాల్సిన ఈ సినిమా ఓపెనింగ్ అంత గ్రాండ్ గా జరిపి ఇప్పటిదాకా షూటింగ్ వెళ్లకపోవడం అనుమానాలకు దారితీస్తుంది. సినిమా నిర్మాతగా చరణ్ రంగస్థలం 1986 సినిమా పూర్తి చేయాలని చూస్తుండగా సినిమాలో మెగాస్టార్ లుక్ ఏది ఫైనల్ కాకపోవడమే సినిమా లేటుకి మరింత కారణం అని తెలుస్తుంది. మరి ఇలానే లేటు చేస్తూ పోతే ఆ సినిమా 2018 లో రిలీజ్ కష్టమే మరి.