శైలజ రెడ్డి అల్లుడవుతున్న చైతు..!

యుద్ధం శరణంతో నిరాశ పరచిన నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి డైరక్షన్ లో సవ్యసాచి సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాధవన్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య మారుతి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఇటీవల వచ్చిన మహానుభావుడుతో హిట్ అందుకున్న మారుతి తన హిట్ ట్రాక్ కంటిన్యూ చేస్తూ ఉన్నాడు.

ఇక మారుతి, నాగ చైతన్య కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు టైటిల్ గా శైలజ రెడ్డి అల్లుడు అని పెట్టబోతున్నార. ఇందులో శైల రెడ్డిగా రమ్యకృష్ణ నటిస్తున్నారని తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందట. మరి శైలజ రెడ్డి అల్లుడిగా చైతు ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.