మహేష్ మూవీ టైటిల్ అది కాదా..!

శ్రీమంతుడు కాంబినేషన్ లో మహేష్ కొరటాల శివ కలిసి చేస్తున్న సినిమా టైటిల్ భరత్ అను నేను అని ఎన్నాళ్ల నుండో వినిపిస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ ను ఏప్రిల్ 27న కన్ ఫాం చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో డివివి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నెంబర్3 అని ఉంది కాని భరత్ అను నేను అని రాయలేదు. ఇప్పుడు మళ్లీ మహేష్ ఫ్యాన్స్ లో కన్ ఫ్యూజన్ మొదలైంది.

ఇలానే స్పైడర్ విషయంలో కూడా ఊరించి ఊరించి స్పైడర్ అని పెట్టి సినిమానే నిరాశ పరచేలా చేశారు. ఇక ఇప్పుడు మహేష్ చేస్తున్న సినిమాకు ఈ ఎక్సయిట్మెంట్ ఫ్యాన్స్ ను మళ్లీ కన్ ఫ్యూజ్ చేస్తుంది. భరత్ అను నేను కాకుండా సినిమా టైటిల్ త్వరగా ఎనౌన్స్ చేస్తే బెటర్ లేదంటే సినిమా మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ టైటిల్ అదే అయినా లోగో రివీల్ చేయడం ఇష్టం లేకనే ప్రొడక్షన్ నెంబర్ 3 అని పెట్టి ఉంటారన్న టాక్ ఉంది. మరి మహేష్ కొరటాల శివ అసలు టైటిల్ ఏంటి అన్నది వేచి చూడాలి.