
విక్టరీ వెంకటేష్ తేజ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సుమంత్, నారా రోహిత్ లలో ఒకరు విలన్ గా నటిస్తారని అన్నారు. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం వెంకటేష్ తో నారా రోహిత్ నటించడం కన్ఫాం అంటున్నారు. ఇక రోహిత్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడని ఎక్స్ క్లూజివ్ టాక్. హీరోగా సినిమాలు చేస్తూనే సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్న నారా రోహిత్ ఇప్పుడు విలన్ గా కూడా కొత్త టర్న్ తీసుకుంటున్నాడు.
తేజ సినిమాలో విలన్లకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు హీరోగా చేస్తున్న గోపిచంద్ జయం, నిజం సినిమాల్లో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అందుకే రోహిత్ ఎలాంటి డౌటు లేకుండా ఈ సినిమాకు ఒప్పుకున్నాడట. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అనీల్ సుంకర, సురేష్ బాబు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు టైటిల్ గా ఈ నగరానికి ఏమైంది అన్న టైటిల్ పరిశీలణలో ఉందట.