సునీల్ కోసం త్రివిక్రమ్ సూపర్ ఆఫర్..!

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం సామెత తెలిసిందే.  ప్రపంచంలో కన్నవారికన్నా మంచి స్నేహితుడు ఉంటే గొప్ప వరం అంటారు. తాజాగా టాలీవుడ్ లో వరుస విజయాలతో నెంబర్ వన్ డైరెక్టర్ లిస్ట్ లో ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో ఓ సినిమా తీస్తున్నాడు.  ఈ చిత్రం పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ తో డైరెక్షన్ చేయబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ముహూర్తం మొన్న అయ్యింది. ప్రత్యేక అతిధిగా పవన్ కళ్యాన్ వచ్చి ఎన్టీఆర్ కి సినిమాకు క్లాప్ కొట్టాడు.  ఇక ఇండస్ట్రీకి  రాకముందు  త్రివిక్రమ్, సునీల్  రూమ్ మేట్స్.  

హాస్యనటుడిగా మంచి ఫామ్ లో ఉన్న సునీల్ కి హీరోగా మారమని  సలహా ఇచ్చింది మాటల మాంత్రికుడే. అయితే హీరోగా మారిన సునీలో కొత్తలో వరుస విజయాలు సాధించినా గత కొంత కాలంగా అపజయాలు మూటగట్టుకుంటున్నాడు. అయితే సునీల్ సినిమా కెరీర్‌లో త్రివిక్రమ్ పాత్ర చాలా ఉందనే చెప్పాలి. స్నేహితుడికి ఈ మద్య కలిసి రావడం లేదని.. త్రివిక్రమ్ ఎన్టీఆర్ కలయికలో వస్తోన్నసినిమాలో సునీల్ ఓ ముఖ్యమైన పాత్ర ఇచ్చాడట.  వాస్తవానికి ఆ పాత్రను నారా రోహిత్ చేయాల్సి ఉంది. ఆ పాత్రలో సునీల్ నటించేలా త్రివిక్రమ్ ఎన్టీఆర్‌ను ఒప్పించారట. గతంలో తన సినిమాలో మంచి చాన్స్ ఇస్తానని సునీల్ కి ప్రామిస్ చేశాడట త్రివిక్రమ్.