టైటిల్ ఎనౌన్స్ కు ఎందుకింత రచ్చ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా టైటిల్ విషయంలో ఇంకా కన్ ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. అజ్ఞాతవాసి అన్న టైటిల్ కన్ఫాం అనేసినా అఫిషియల్ గా చిత్రయూనిట్ వెళ్లడించలేదు. అంతేకాదు ఈ సినిమా ఒక్క కాన్సెప్ట్ పోస్టర్ తప్ప ఫస్ట్ లుక్ పోస్టర్ కాని టీజర్ కాని రివీల్ చేయలేదు. ముందు పవన్ బర్త్ డే ఆ తర్వాత దసరా, దీపావళి ఇలా పండుగ పేర్లన్ని చెప్పారు. కాని సినిమా టైటిల్ మాత్రం రివీల్ చేయలేదు.  

అసలు టైటిల్ ఫస్ట్ లుక్ టీజర్ మీద ఎందుకింత జాప్యం చేస్తున్నారు అన్నది తెలియట్లేదు. సినిమా మీద అంచనాలు పెంచేందుకే ఈ హంగామా చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ఫైనల్ గా నవంబర్ 7న త్రివిక్రం పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ ఉంటుందని చెబుతున్నారు. మరి అప్పుడైనా పవన్ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ ఉంటుందా లేదా అన్నది చూడాలి.