
కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు హీరోగా కూడా మారి సినిమాలు చేస్తున్నాడు. గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా సినిమాలలో శ్రీనివాస్ రెడ్డి సోలో హీరోగా నటించి మెప్పించాడు. అయితే హీరోగా మారాం కదా అని కామెడీ వేషాలకు గుడ్ బై చెప్పకుండా అటు వచ్చిన సినిమా అవకాశాన్ని కూడా అందుకుంటున్నాడు. రీసెంట్ గా రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ పక్కన దాదాపు సినిమా మొత్తం కనిపించాడు శ్రీనివాస్ రెడ్డి.
కేవలం హీరో కమెడియన్ మాత్రమే కాదు అతనిలో దర్శకుడు ఉన్నాడట. సినిమాల్లో నటిస్తున్న తరుణంలో దర్శకత్వం మీద కూడా ఇంట్రెస్ట్ పెంచుకున్న శ్రీనివాస్ రెడ్డి త్వరలో మెగా ఫోన్ పట్టబోతున్నాడట. అది కూడా రవితేజ హీరోగా ఓ సినిమా వస్తుందని అంటున్నారు. తన దగ్గర ఉన్న ఓ కథను రవితేజకు చెప్పగా ఓకే అన్నాడట. ఎలాగు సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి కమెడియన్ నుండి హీరోగా ఇప్పుడు దర్శకుడిగా కూడా మారాలని ప్రయత్నాలు చేస్తున్నాడు శ్రీనివాస్ రెడ్డి.