ఇంట్రడక్షన్ సాంగ్ తో మహేష్ ఎంట్రీ

తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ సినిమా రూపొందనుంది. పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో తమిళ దర్శకుడు ఎస్.జే.సూర్య విలన్ గా నటించబోతున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ సినిమాటోగ్రఫిని అందించనున్నాడు.

ఈ సినిమాకు సంబంధించి దాదాపు సాంకేతికవర్గం మొత్తం ఖరారు అయ్యారు కానీ.. మహేష్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరా అని ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు. అనుష్క, కాజల్, సమంత వంటి సౌత్ భామలతో పాటు సోనాక్షి సిన్హా, దీపికా పదుకునే, ఆలీయా భట్ వంటి బాలీవుడ్ భామల పేర్లు కూడా వినిపించినా అవి రూమర్లేనని తెలిపోయాయి. అయితే తాజాగా బాలీవుడ్ యువ హీరోయిన్ పరిణితి చోప్రాను మహేష్ కు జోడిగా ఖరారు చేసారని సినీవర్గాల సమాచారం.

మహేష్ కూడా కొత్త హీరోయిన్ అయితేనే బాగుంటుందనే ఉద్దేశ్యంతో వుండటంతో బాలీవుడ్ భామల కోసం మురుగదాస్ ఇంతకాలం వెతికాడని తెలిసింది. చివరకు పరిణితి చోప్రాను మహేష్ కు జోడిగా ఫైనలైజ్ చేసినట్లుగా సమాచారం. అతి త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ మరికొద్ది రోజుల్లోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ముందుగా హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ను చిత్రీకరించనున్నారని తెలిసింది. ఈ చిత్రానికి హారీస్ జయరాజ్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేష్ తన లుక్స్ ను పూర్తిగా మార్చేసి, కొత్తగా కనిపించనున్నాడని సమాచారం. ఏదేమైనా మురుగదాస్-మహేష్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ట్ అంటూ అభిమానులు ధీమాగా వున్నారు.