
టాలీవుడ్ నుండి బాలీవుడ్ చెక్కేసిన గోవా సుందరి ఇలియానా అక్కడ అనుకున్న సక్సెస్ అందుకోలేదు. ఇక పర్సనల్ గా ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతుంది అమ్మడు. ఇద్దరి మధ్య వ్యవహారం ఓ రేంజ్ లో సాగుతుంది. తనతో డేటింగ్ లో ఉన్నా అంటూ ఓపెన్ గా చెబుతున్న ఇలియానా ఈమధ్య తన ప్రవర్తనలో మార్పుని చూస్తుంటే ఆండ్రూని పెళ్లాడిందని అంటున్నారు.
రీసెంట్ గా ఆస్ట్రేలియా వెళ్లొచ్చిన ఇల్లి బేబి ప్రవర్తనలో కొట్టొచ్చినట్టు మార్పులు కనిపిస్తున్నాయి. అందరు దాదాపు ఇలియానా పెళ్లి అయ్యిందని అంటున్నారు. అయితే ఈ విషయంపై మాత్రం ఇలియానా నోరు విప్పలేదు. ఆండ్రూతో ఎప్పటిలానే సహజీవనంలో ఉన్నట్టుగానే చెబుతుంది. టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన చిట్టినడుము సుందరి బీ టౌన్ లో బర్ఫీ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా అనుకున్న రేంజ్ కు వెళ్లలేకపోయింది.