ప్రముఖ నిర్మాత మేడసాని మృతి

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత మేడసాని వెంకటాద్రినాయుడు మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు చెల్లెలు భర్త. మోహన్ బాబు నటించిన అనేక సినిమాలకు ఆయనే నిర్మాత. చిత్తూరు జిల్లాలో మోహన్ బాబు స్థాపించిన విద్యానికేతన్ విద్యాసంస్థలకు ఆయనే కోశాధికారిగా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. అయన అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం చిత్తూరులో జరిగే అవకాశం ఉంది.