ఎన్.టి.ఆర్ సినిమాకు పవన్ క్లాప్..!

టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకు పోతున్న టాప్ హీరో ఎన్టీఆర్.  ఇప్పటి వరకు టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయం సాధించిన ఎన్టీఆర్ ఇటీవలే జై లవకుశ సినిమాతో అందరి ప్రశంసలు అందుకున్నాడు.  ఎన్టీఆర్ కాగా ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కు రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ నటించనున్న కొత్త సినిమా ముహూర్తానికి పవన్ కళ్యాన్ అతిధిగా వచ్చారు.

మొదటిసారిగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమా డిసెంబర్ వరకు కంప్లీట్ చేసి జనవరి నుండి ఎన్టీఆర్ సినిమా చేయనున్నాడు.  అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ తోడైతే సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి.