ప్రభాస్ సాహో ఫస్ట్ లుక్ అదుర్స్..!

టాలీవుడ్ లో చత్రపతి,డార్లింగ్, మిర్చి లాంటి సినిమాలతో మంచి సక్సెస్ బాటలో నడుస్తున్న ప్రభాస్ కి  రాజమౌళి అందించిన అద్భుత సినిమాలు బాహుబలి, బాహుబలి2. ఇక బాహుబలి సీరీస్ ప్రపంచ వ్యాప్తంగా అఖండ విజయం సాధించడంతో ప్రభాస్ జాతీయ స్థాయి నటుడు అయ్యాడు. ప్రస్తుతం సుజీత్‌ డైరెక్ట్ చేస్తున్న సాహో సినిమాలో నటిస్తున్నాడు. ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా ఈరోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.      

ప్రభాస్‌ బ్లాక్‌ కోట్‌ ధరించి.. ఒక చెయ్యి పాకెట్‌లో మరో చేతిలో ఫోన్‌ పట్టుకుని నడుచుకుంటూ వస్తున్న స్టిల్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ప్రభాస్ సరసన  బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా‌కపూర్‌ నటిస్తుంది. ఇందులో యాక్షన్‌ సీన్స్ కోసం దాదాపు రూ.40 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు యూనిట్ చెబుతున్నమాట. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ప్రభాస్ ఫస్ట్ లుక్ చూసి సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని తెగ సంబరపడి పోతున్నారు.