విలన్ గా సక్సెస్ అవుతున్న దర్శకుడు..!

ఖుషి సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ఎస్.జె.సూర్య.  ఆ దెబ్బతో పవన్ కళ్యాన్ రేంజ్ ఎక్కడికో వెళ్లింది.  తమిళ, తెలుగు భాషల్లో సక్సెస్ ఫుల్ దర్శకుడుగా ఎస్. జె.సూర్య ఈ మద్య విలన్ అవతారం ఎత్తాడు. విలన్ గా కొత్త ఉత్సాహం చూపిస్తున్నాడు ఎస్.జె.సూర్య.    

హీరోగా, దర్శకుడుగా పరాజయాలు పలకరించటంతో ఇప్పుడు విలనిజంపై దృష్టి సారించాడు. స్పైడర్ సినిమా ప్రేక్షకుల్ని, అభిమానుల్ని నిరాశపరిచినా అందులో విలన్‌గా నటించిన సూర్యకి మంచి పేరు వచ్చింది. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన మెర్సల్ ‌లో సూర్య విలనీ పీక్స్‌కి వెళ్లిందన్నది కోలీవుడ్ ఇండస్ట్రీ టాక్. దీంతో దర్శకత్వం కన్నా నటుడిగా.. అందులోనూ విలన్ గా తన కెరీర్ బాగుందని అంటున్నాడు ఎస్. జె.సూర్య.