
విక్టరీ వెంకటేష్ హీరోగా తేజ డైరక్షన్ లో ఓ సినిమా స్టార్ట్ అవుతుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెంకటేష్ ప్రొఫెసర్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఇక ఇందులో ఓ యువ హీరో కూడా నటిస్తాడని లేటెస్ట్ టాక్. సినిమాలో ఓ కుర్ర హీరోకి అవకాశం ఉందట. పాత్ర ప్రాధాన్యతను బట్టి హీరో ఇమేజ్ ఉన్న వారే చేస్తే బాగుంటుందని తేజ అనుకుంటున్నారట.
ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆ పాత్రలో అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ కాని.. నారా రోహిత్ కాని నటించే అవకాశాలున్నాయట. తేజ డైరక్షన్ లో అది కూడా క్రేజీ మల్టీస్టారర్ గా సినిమా అంటే కచ్చితంగా సినిమా మరోసారి తేజ రేంజ్ హిట్ అందుకుంటుందని అంటున్నారు. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ అందుకున్న తేజ వెంకటేష్ సినిమాతో కూడా హిట్ కొట్టి సత్తా చాటాలని చూస్తున్నాడు. అనీల్ సుంకర, సురేష్ బాబు కలిసి ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది.