
కింగ్ నాగార్జున సంచలన దర్శకుడు వర్మ కలిసి శివతో సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. ట్రెండ్ సృష్టించడం అప్పటి నుండే స్టార్ట్ చేసిన వర్మ చాలా కాలం తర్వాత నాగార్జునతో సినిమా చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం వర్మ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా హడావిడిలో ఉండగా ఆ సినిమాను పక్కన పెట్టేసి నవంబర్ నుండి నాగ్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారట.
2018 లో మార్చి కల్లా పూర్తి చేస్తారట. ప్రస్తుతం ఫాంలో లేని వర్మకు పిలిచి మరి నాగార్జున ఛాన్స్ ఇస్తున్నాడు అంటే కచ్చితంగా మళ్లీ ఇద్దరు కలిసి ఓ సంచలన సినిమాతోనే వస్తాడని తెలుస్తుంది. ఈమధ్యనే వచ్చిన రాజు గారి గది-2తో హిట్ అందుకున్న నాగార్జున తన తర్వాత సినిమా వర్మతోనే అని కన్ఫాం చేశాడు. మరి శివ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.