
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ టీజర్ గురించి ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ విషయంపై ఏమాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దసరా మిస్ అయ్యింది దీపావళికైనా ఫస్ట్ లుక్ టీజర్ లేదా కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ అయినా వస్తుంది అనుకుంటే అది మిస్ అయ్యింది. అసలు త్రివిక్రం ఎందుకు ఈ సినిమా విషయంలో లేటు చేస్తున్నాడో తెలియడం లేదు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో కె.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2018 జనవరి 10న రిలీజ్ చేయనున్నారట. షూటింగ్ అనుకున్న విధంగా పూర్తి చేస్తున్నా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ జాప్యం ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదు.