
యువ హీరో నిఖిల్ డిఫరెంట్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. చందు మొండేటి డైరక్షన్ లో వచ్చిన కార్తికేయ సినిమా సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఒక్క సినిమాతోనే చందు మొండేటి తన సత్తా ఏంటో చూపించాడు. అయితే మరోసారి నిఖిల్ తో సినిమా షురూ చేయాలని చూస్తున్నాడు చందు మొండేటి. ఈ కాంబినేషన్ దిల్ రాజు సెట్ చేస్తున్నాడని తెలుస్తుంది.
ఈ ఇయర్ దిల్ రాజు చేసిన సినిమాలన్ని సూపర్ సక్సెస్ అయ్యాయి. వచ్చే సంవత్సరం కూడా ఇదే సక్సెస్ ఫాం కొనసాగించేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే నిఖిల్, చందుల కార్తికేయ కాంబోని రిపీట్ చేస్తున్నాడు. మరో పక్క మహేష్, వంశీ పైడిపల్లి సినిమా నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అవుతున్నాడు. మరి చూస్తుంటే దిల్ రాజు హిట్ మేనియా కొనసాగించేలానే ఉన్నాడు.